Year Ender 2025: IMDB రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.. తెలుగు సినిమాలు ఏవంటే?
IMDB ప్రతి సంవత్సరం చివర్లో తన పాపులర్ సినిమాల జాబితాను విడుదల చేస్తుంది. అలా ఈ సారి కూడా ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల IMDB చేసింది. టాప్ -10 లో ఉన్న సినిమాలు ఏవంటే?

2025 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 2026 రాబోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే IMDb ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విశ్లేషించి అందించే వేదికైన ఐఎండీబీ తాజాగా అత్యంత ప్రజాదరణ పొందిన 10 భారతీయ సినిమాలు, 10 వెబ్ సిరీస్‌ల జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సైయారా ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అనీత్ పద్దా, అహన్ పాండే హీరో హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్‌తో పాటు యావత్ సినిమా దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఏకంగా 550 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక హోంబాలే ఫిల్మ్స్ యానిమేటెడ్ చిత్రం ‘మహావతార నరసింహ’ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. విక్కీ కౌశల్ కన్నడ నటి రష్మిక మందన్న నటించిన ‘ఛావా’ మూడవ స్థానంలో నిలిచింది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ (ఐదవ స్థానం), ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ (ఆరవ స్థానం), ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ (ఏడవ స్థానం) సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ‘దేవా’, ‘రైడ్ 2’, మలయాళ ‘లోకా’ వరుసగా ఎనిమిదవ, తొమ్మిది, పదో స్థానాలను దక్కించుకున్నాయి.
IMDb టాప్ 10 సినిమాలు.. ఒక్క వీడియోలో..
Cinema that defined the year. 🎞️
Take a look at the Top 10 Most Popular Indian Movies of 2025 on IMDb, Determined by Fans. Always. 🙌
📍 Of all the movies released in India between January 1 and November 30, 2025, that have an average IMDb user rating of 6 or higher, these 10… pic.twitter.com/1C5dz0nrcN
— IMDb India (@IMDb_in) December 10, 2025
IMDb 2025 లో టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సిరీస్‌లు
- ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్
- బ్లాక్ వారెంట్
- పాతాళ్ లోక్ సీజన్ 2
- పంచాయితీ సీజన్ 4
- మండల మర్డర్స్
- ఖాఫ్
- స్పెషల్ ఓపీఎస్2
- ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)
- ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
- క్రిమినల్ జస్టిస్
The shows we all clicked, searched and discussed the most in 2025 🎞️
📍 Of all the series released in India between January 1 and November 30, 2025, that have an average IMDb user rating of 6 or higher, these 10 titles were consistently the most popular with IMDb customers, as… pic.twitter.com/D53i6x473F
— IMDb India (@IMDb_in) December 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








