నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా.. నాపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు: రేణు దేశాయ్
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు రేణు దేశాయ్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రేణూ దేశాయ్.

ప్రముఖ నటి రేణు దేశాయ్.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రేణు దేశాయ్.. ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. అలాగే ఇటీవల బ్యాడ్ గార్ల్స్ అనే సినిమాలో నటించారు. సినిమాలతో పాటు రేణు దేశాయ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాల పైన ముగా జీవాల సంరక్షణ పై ఆమె తన అభిప్రాయాలను సూచనలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. కాగా రీసెంట్ గా రేణు దేశాయ్ మీద రకరకాల వార్తలు, రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
రేణు దేశాయ్ రాజకీయాల్లోకి చేరుతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో ఆమె చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే రీసెంట్ గా రేణు దేశాయ్ మీడియా వ్యక్తి పై సీరియస్ అవ్వడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. దాంతో ఆమె పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన పై వస్తున్న రూమర్స్ అలాగే ట్రోల్స్ పై రేణు దేశాయ్ స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో ఆమె క్లారిటీ ఇస్తూ.. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు అని అన్నారు. కొందరు కావాలనే తన పై లేనిపోనీ వార్తలు రాస్తున్నారని ఆమె అన్నారు. అదేవిధంగా మీడియా పై సీరియస్ అవ్వడం పై క్లారిటీ ఇస్తూ.. తనకు మీడియా అంటే చాలా గౌరవం ఉందని.. కానీ ఓ వ్యక్తి తన పై సీరియస్ అవ్వడంతో తాను కూడా గట్టిగా మాట్లాడానని అన్నారు. ఆ మీడియా వ్యక్తి చాలా దురుసుగా తనను కొట్టేంతగా మాట్లాడటంతో తాను కూడా సీరియస్ అయ్యాను అని తెలిపారు. అదేవిధంగా తన పై కొందరు ట్రోల్ చేస్తున్నారని.. అందుకే పవన్ కళ్యాణ్ వదిలేశాడు.. ఆమెకు తిక్క ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారని రేణు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎదో కుక్కల కోసం పోరాడుతున్నా.. దాని వల్ల నాకు డబ్బులు రావు కానీ వాటికి మంచి జరుగుతుంది. నామీద నేటిజివ్ కామెంట్స్ చేస్తే మీకు ఏం మంచి జరుగుతుంది. నేను కుక్కలా కోసమే కాదు.. మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా.. నాపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
