విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది. మాస్ రాజా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అత్తిలి సత్తిబాబుగా ఓ పాత్రలో తన కామెడీతో అదరగొట్టాడు. అలాగే విక్రమ్ రాథోడ్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించి మెప్పించాడు రవితేజ.

విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2024 | 2:51 PM

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టార్సే.. ఒకొక్క సినిమా ఒకొక్క స్టైల్ లో ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది. మాస్ రాజా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అత్తిలి సత్తిబాబుగా ఓ పాత్రలో తన కామెడీతో అదరగొట్టాడు. అలాగే విక్రమ్ రాథోడ్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించి మెప్పించాడు రవితేజ. ఇక ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రీసెంట్‌గా రీరిలీజ్ కూడా అయ్యింది. రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్.

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

విక్రమార్కుడు సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? ఆమె పేరు జయవాణి. విక్రమార్కుడు సినిమాలో ఆమె ఓ సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకుంది. క్రికెట్ బాల్ తో కొట్టాడని పిల్లని  బట్టలూడదీస్తాడు.. దాంతో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి రవితేజతో పెద్ద గొడవే పెట్టుకుంటారు. ఆ పిల్లల తల్లులతో రవితేజ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఆ సీన్ లో జయవాణి ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? ఆమె చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. చాలా సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నారు జయవాణి. తాజాగా ఆమెకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవీడియోలో ఆమె మాస్ రాజా రవితేజ గురించి మాట్లాడింది. ఆమె ఈ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రవితేజ వచ్చారు.. జయవాణి ఎవరు..? అన్నారు నేనే సార్ అని చెప్పా.. అమ్మ ఇది మంచి సీన్.. నాకు చాలా నచ్చింది. మీరు కొట్టండి నేను కొడతా..మీరు జుట్టుపట్టుకోండి..నేను కూడా జుట్టు పీకుతా.. మీరు ఏం ఫీల్ అవ్వొద్దు అని అన్నారు. ఆయన అలా చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నా.. హీరో ఇలా నన్ను కొట్టండి అని చెప్పడం మాములు విషయం కాదు. ఇక సీన్ లోకి వెళ్లిన తర్వాత నిజంగానే కొట్టుకున్నాం.. ఆయన జుట్టు కొంచం నా చేతికి కూడా వచ్చింది అన్నారు జయవాణి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జయవాణి.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జయవాణి.

View this post on Instagram

A post shared by Angi Laagu (@angi_laagu)

జయవాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..