Nanu Mattu Gunda 2: సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రయత్నం.. డబ్బింగ్ చెప్పిన కుక్క.. వైరల్ వీడియో

మనుషులకు జంతువులకు మధ్య బాండింగ్ నేపథ్యంలో సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు వచ్చాయి. '777 చార్లీ', 'నాను మత్తు గుండా' లాంటి సినిమాలు కన్నడ భాషల్లో వచ్చాయి . ఇప్పుడు 'నాను మత్తు గుండా' రెండో భాగం రాబోతోంది. ఈ సినిమాలో కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. చెవిలో హెడ్‌ఫోన్‌లు పెట్టుకొని రికార్డింగ్ మైక్ ముందు కుక్క డబ్బింగ్ చెప్పింది.

Nanu Mattu Gunda 2: సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రయత్నం.. డబ్బింగ్ చెప్పిన కుక్క.. వైరల్ వీడియో
Dog Dubbing
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2024 | 12:24 PM

ఒక సినిమా తీయడం అంటే చాలా అంత ఈజీ కాదు.. చాలా సినిమాలు షూటింగ్ తర్వాత డబ్బింగ్ జరుగుతాయి.. కొన్ని సినిమాకు లైవ్ లోనే వాయిస్‌లు రికార్డ్ చేస్తుంటారు. అయితే మనుషులు, జంతువులకు మధ్య సంబంధం గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే మనుషులు డబ్బిగ్ చెప్తారు. మరి జంతువల వాయిస్ ఎలా.. అవి కూడా డబ్బింగ్ చెప్తాయా.? అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

మనుషులకు జంతువులకు మధ్య బాండింగ్ నేపథ్యంలో సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు వచ్చాయి. ‘777 చార్లీ’, ‘నాను మత్తు గుండా’ లాంటి సినిమాలు కన్నడ భాషల్లో వచ్చాయి . ఇప్పుడు ‘నాను మత్తు గుండా’ రెండో భాగం రాబోతోంది. ఈ సినిమాలో కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. చెవిలో హెడ్‌ఫోన్‌లు పెట్టుకొని రికార్డింగ్ మైక్ ముందు కుక్క డబ్బింగ్ చెప్పింది. కుక్కకు సంబందించిన వీడియోలు సినిమాలో అవసరమైన చోట వాడుతున్నారు. అరవడం మాత్రమే కాదు, రకరకాల భావోద్వేగాల సౌండ్స్ కూడా రికార్డ్ చేశారు మేకర్స్.

ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

‘నాను మత్తు గుండా’ మొదటి భాగం జంతు ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం రాబోతోంది. రాకేష్ అడిగా నటిస్తున్న ఈ సినిమాలో అతనితో పాటు సింబా అనే కుక్క కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ‘నాను మత్తు గుండా’ చిత్రానికి దర్శకత్వం వహించిన రఘు హాసన్ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టారు. సినిమా మొత్తం సింబా వాయిస్ ఉంటుంది. ఈ విషయమై దర్శకుడు రఘు హాసన్‌ మాట్లాడుతూ.. కుక్కల జాతికి ప్రత్యేకమైన ధ్వని ఉంటుంది. సినిమాలో కుక్క వాయిస్ నిజమైనదిగా వినిపించేలా సింబా స్వయంగా డబ్బింగ్ చెప్పారు. కుక్కతో డబ్బింగ్ చెప్పడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. పోయెమ్ పిక్చర్స్ బ్యానర్‌పై రఘు హాసన్ ‘నాను మత్తు గుండా’ చిత్రాన్ని నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాను కన్నడతో పాటు ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కుక్క డబ్బింగ్ చెప్పడం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..