Mareechika: అందాల భామలు రెజీనా, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న ‘మరీచిక’
ఇటీవల కాలంలో థ్రిల్లర్ , హారర్ సినిమాకు క్రేజ్ పెరిగిపోతోంది. ఇలాంటి కథలను ఎంచుకొని సినిమాలు చేయడానికి హీరో హీరోయిన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు

ఇటీవల కాలంలో థ్రిల్లర్ , హారర్ సినిమాకు క్రేజ్ పెరిగిపోతోంది. ఇలాంటి కథలను ఎంచుకొని సినిమాలు చేయడానికి హీరో హీరోయిన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు అందాల భామ రెజీనా(Regina Cassandra), అనుపమ(Anupama Parameswaran). అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మరీచక’(Mareechika) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘మరీచక’ అనే టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కళ్లను కనికట్టు చేసే భ్రమ అని ఈ టైటిల్‌కు అర్థం
అందరిలో ఆసక్తి పెంచుతోన్న ‘మరీచక’ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను గురువారం రోజున విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే అందులో కేవలం పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడలాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్రతీకారం’ అనేది క్యాప్షన్. ఈ పోస్టర్ అందరిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆసక్తిని మరింత పెచింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వన్ మోర్ హీరో బ్యానర్‌పై రవి చిక్కాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాళ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలను అందించారు. దీంతో పాటు లక్ష్మీ భూపాళ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
