Raviteja: హాట్రిక్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‎తో మాస్ మహారాజా..

ఇక 2021లో వచ్చిన క్రాక్ సినిమా గోపిచంద్, రవితేజకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే క్రాక్ సినిమాకు ముందు వీరిద్దరు కొంత కాలంగా వరుసగా డిజాస్టర్స్ అందుకుంటున్నారు. అదే సమయంలో మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన క్రాక్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు వీరి కాంబో రిపీట్ కాబోతుంది.

Raviteja: హాట్రిక్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‎తో మాస్ మహారాజా..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 09, 2023 | 12:37 PM

ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు మాస్ మాహారాజా. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబో. ఇప్పటికే వీరి కలయికలో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్స్ వచ్చాయి. ఇక 2021లో వచ్చిన క్రాక్ సినిమా గోపిచంద్, రవితేజకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే క్రాక్ సినిమాకు ముందు వీరిద్దరు కొంత కాలంగా వరుసగా డిజాస్టర్స్ అందుకుంటున్నారు. అదే సమయంలో మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన క్రాక్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు వీరి కాంబో రిపీట్ కాబోతుంది.

పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కొత్త ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. మాస్ మాహారాజా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో రవితేజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.