Tollywood: టాలీవుడ్‏లో యంగ్ బ్యూటీస్ జోరు.. రెమ్యూనరేషన్స్ భారీగా పెంచేస్తోన్న హీరోయిన్స్..

దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ ఉన్నపుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.. ఇండస్ట్రీని దీన్ని మించిన సూత్రం మరోటి లేదు. అందుకే ఇమేజ్ ఉన్నపుడే ఎంత డిమాండ్ చేసినా.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు అంటున్నారు హీరోయిన్లు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న కొన్నాళ్లూ ఫుల్‌గా సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు.

Tollywood: టాలీవుడ్‏లో యంగ్ బ్యూటీస్ జోరు.. రెమ్యూనరేషన్స్ భారీగా పెంచేస్తోన్న హీరోయిన్స్..
Actress
Follow us

|

Updated on: Jul 09, 2023 | 12:33 PM

దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ ఉన్నపుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.. ఇండస్ట్రీని దీన్ని మించిన సూత్రం మరోటి లేదు. అందుకే ఇమేజ్ ఉన్నపుడే ఎంత డిమాండ్ చేసినా.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు అంటున్నారు హీరోయిన్లు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న కొన్నాళ్లూ ఫుల్‌గా సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్..? ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఒక్కో సీజన్ ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంది. మొన్నటి వరకు కృతి శెట్టి దుమ్ము దులిపేసారు. ఇప్పుడు మృణాళ్ ఠాకూర్, శ్రీలీల లాంటి ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. శ్రీలీల అయితే ఏకంగా 10 సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమాకు ఎలా డేట్స్ ఇస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. పవన్ నుంచి మొదలుపెడితే సిద్ధూ జొన్నలగడ్డ వరకు అందరితోనూ నటిస్తున్నారు శ్రీలీల.

రెమ్యునరేషన్ విషయంలోనూ నో కాంప్రమైజ్ అంటున్నారు శ్రీలీల. ధమాకాకు ముందు లక్షల్లో ఉన్న ఈమె పారితోషికం.. ఇప్పుడు కోట్లకు చేరిపోయింది. కొత్త సినిమా ఏది సైన్ చేసినా కనీసం కోటి.. ఆపైనే తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. ఆమెకున్న క్రేజ్‌కు నిర్మాతలు కూడా ఆనందంగా ఇస్తున్నారు. మరోవైపు సీతా రామం సుందరి మృణాళ్ ఠాకూర్ అయితే మరీనూ.. ఏకంగా 2 కోట్లు కావాలంటున్నారు ఈ భామ.

ఇవి కూడా చదవండి

నాని 30తో పాటు విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాలోనూ మృణాళ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గ్లామర్ షోలోనూ మొహమాటం లేకపోవడంతో నిర్మాతలు మృణాళ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. క్రేజ్ ఉంది కాబట్టి అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం మృణాల్ హిందీలో ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఆ మధ్య కృతి శెట్టి సైతం సినిమాకు కోటిన్నర వరకు డిమాండ్ చేసారు. తర్వాత ఫ్లాప్స్ ఎఫెక్ట్‌‌తో తగ్గక తప్పలేదు.