Ravi Teja: ఫుల్ స్వింగ్ లో మాస్ మహారాజా.. జులై లో కొత్తసినిమాను పట్టాలెక్కించనున్న రవితేజ..
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. చాలా కాలం తర్వాత క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడు రవితేజ.

Ravi Teja:
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. చాలా కాలం తర్వాత క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఖిలాడి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. ఇటీవలే రమేష్ వర్మ తమిళ్ రీమేక్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఖిలాడి సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది.ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే కొత్త సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు మాస్ రాజా.
ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత రవితేజ ఎంత మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. వచ్చేనెలలో త్రినాథరావు నక్కిన సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ తో కూడిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :