Ravi Teja : శరత్ మండవ దర్శకత్వంలో మాస్ రాజా .. ప్రభుత్వ అధికారిగా కనిపించనున్న రవితేజ..
ఈ మధ్యన ఎక్కవగా పోలీసు క్యారెక్టర్‌లో కనిపిస్తూ సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేస్తున్న రవితేజ.. కాస్త రూటు మార్చారు. నిన్న గాక మొన్ననే పోతురాజు వీరశంకర్ అంటూ..
Ravi Teja :
ఈ మధ్యన ఎక్కవగా పోలీసు క్యారెక్టర్‌లో కనిపిస్తూ సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేస్తున్న రవితేజ.. కాస్త రూటు మార్చారు. నిన్న గాక మొన్ననే పోతురాజు వీరశంకర్ అంటూ.. క్రాక్ పోలీస్‌గా అదరగొట్టిన ఈ మాస్ రాజా..ఇప్పుడు కాకి చొక్కాని పక్కన బెట్టనున్నారు. మిడిల్ క్లాస్‌లా మారిపోయి బుద్దిగా ఓ గవర్నమెంట్ జాబ్ చేసుకోనున్నారు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగనుందట.ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా, ఇప్పటివరకు చూడని లుక్‌లో కనిపిస్తారట. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ శరత్ ఈ సినిమా కథను సిద్దం చేశారట. అంతే సహజంగా తెరకెక్కించేదుకు అన్ని విదాలుగా ట్రై చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్.
ఇక ఈ సినిమాలో రవితేజ ఇద్దరు కథానాయికలతో ఆడిపాడనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మాస్ రాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :