Rashmika Mandanna: బాలీవుడ్‌లో రష్మికకు మరో బంపరాఫర్.. ప్రియాంక స్థానానికే ఎసరు పెట్టేసిందిగా..
రష్మిక మందన్న పాపులారిటీ ,డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 'పుష్ప', 'పుష్ప 2' సినిమా విజయాలు రష్మిక క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇప్పుడీ అందాల తారకు బాలీవుడ్ లో మరో బంపరాఫర్ దక్కింది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో..

పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ నేషనల్ క్రష్ ప్రియాంక చోప్రా స్థానానికే ఎసరు పెట్టిందని బాలీవుడ్ లో రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఇప్పటివరకు ‘క్రిష్’ సిరీస్ లో తెరకెక్కిన సినిమాల్లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రానే హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ‘క్రిష్ 4’ చిత్రంలో ప్రియాంక స్థానాన్ని రష్మిక భర్తీ చేయనుందని సమాచారం. ‘క్రిష్ 4’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చకా చకా జరుగుతున్నాయి. దీనితో పాటు, నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చేసింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో స్థిరపడింది. ప్రస్తుతానికి ఆమె హిందీ సినిమాలు చేసే అవకాశం లేదు. దీంతో క్రిష్ 4లో ఇతర నటీమణులను ఎంపిక చేసుకోవడం టీమ్‌కు అనివార్యం. ఈ సమయంలో దర్శక నిర్మాతల కళ్లు రష్మిక మందన్నపై పడ్డాయి.
‘క్రిష్ 4’ సినిమాలో హృతిక్ రోషన్ హీరో. అంతేకాదు దర్శకత్వం కూడా తన వహిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అతనితో కలిసి నటించలేదు. దీంతో ఈ కొత్త జంటను చూడటానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న ‘పుష్ప,’ ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావ’ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికిందర్ పరాజయాం పాలైనా ఈ నేషనల్ క్రష్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ‘క్రిష్ 4’ ఆఫర్ కూడా రష్మికకు వచ్చిందని టాక్. అయితే చిత్ర బృందం దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
రష్మిక ప్రస్తుతం ‘థామ’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు ‘కాక్టెయిల్ 2’ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పుడు హృతిక్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రష్మిక కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు చేరుకున్నట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Hrithik Roshan will direct and star in Krrish 4, set to begin filming mid-2026 with a 2027 release. Co-produced by YRF and Rakesh Roshan, the film has a ₹500–700 crore budget and may star Rashmika Mandanna as the lead. A bold new chapter in Indian superhero cinema begins. pic.twitter.com/zPc5UjJsHS
— Indiawood Updates (@IndiawoodUpdate) September 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








