Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక.. ఈ అమ్మడు లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కస్తోంది

తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ బ్యూటీస్ మమాత్రమే కాదు యంగ్ హీరోయిన్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. కాగా రష్మిక వాళ్లందరిలో ఒక అడుగు ముందు ఉంది. దీపికా పదుకొణె ప్రస్తుతం బాక్సాఫీస్ క్వీన్ గా రాణిస్తుంది.

Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక.. ఈ అమ్మడు లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కస్తోంది
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 3:09 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వరుసగా బడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ బ్యూటీస్ మమాత్రమే కాదు యంగ్ హీరోయిన్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. కాగా రష్మిక వాళ్లందరిలో ఒక అడుగు ముందు ఉంది. దీపికా పదుకొణె ప్రస్తుతం బాక్సాఫీస్ క్వీన్ గా రాణిస్తుంది. అందుకు కారణం ఆమె ఖాతాలో ఒకటి రెండు కాదు ఏకంగా 1000 కోట్లు రాబట్టిన 3 సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘శ్రీవల్లి’ అంటే రష్మిక మందన్న ఈ బాక్సాఫీస్ క్వీన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంది. రష్మిక నుంచి ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

పుష్ప 2 – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. పుష్ప 2 రిలీజ్ అయినా తర్వాత రష్మిక పేరు మారుమ్రోగుతుంది. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ కూడా విడుదలకు ముందే కోట్ల బిజినెస్ చేసింది. రష్మిక నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఛావా – రష్మిక మందన్న కూడా ‘యానిమల్’తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ‘పుష్ప 2’తో పాటు ఆమె నటిస్తున్న తదుపరి చిత్రం ‘ఛావ’ కూడా త్వరలో రానుంది. ముందుగా ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ అవుతుందని అనుకున్నారు. కానీ ‘ఛావ’ నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. రష్మిక తొలిసారిగా విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తుంది.

సికిందర్ – రష్మిక మందన్న చేతిలో ఉన్న ఇంకో పెద్ద సినిమా ‘సికందర్’ ఉంది. సల్మాన్ ఖాన్ సరసన రష్మిక కథానాయికగా కనిపించనుంది. సల్మాన్ ఖాన్‌కి కూడా ‘సికిందర్’ చాలా ప్రత్యేకమైన చిత్రం, దాని కోసం సల్మాన్ తన ప్రయత్నాలన్నీ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద 700-800 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు.

కుబేర – సౌత్ సూపర్ స్టార్ ధనుష్, నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర. రష్మిక మందన్న కూడా ‘కుబేర’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

యానిమల్ పార్క్ – ‘యానిమల్’ మంచి విజయం తర్వాత, ఇప్పుడు దాని రెండవ భాగం ‘యానిమల్ పార్క్’ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న మరోసారి రణబీర్ కపూర్‌తో కలిసి కనిపించనుంది. రష్మిక కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘యానిమల్’ నిలిచింది. ‘యానిమల్ పార్క్’ 2026లో విడుదల కానుంది.

థామ – రష్మిక మందన్న నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘థామ’ను దీపావళి సందర్భంగా ప్రకటించారు. దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

గర్ల్‌ఫ్రెండ్ – రష్మిక మందన్న సినిమాల్లో తన పాత్రతో విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అల్లు అరవింద్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో రష్మిక కనిపించనుంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించనున్నారు.

రెయిన్‌బో – రష్మిక మందన్న రాబోయే చిత్రాల జాబితాలో శాంతరూపన్ చిత్రం ‘రెయిన్‌బో’ ఒకటి. ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ కూడా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి :

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంజారాహిల్స్‌ ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్..
బంజారాహిల్స్‌ ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
15 ఏళ్లకే ఫ్లాట్ ఫామ్ పై జీవితం.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్..
15 ఏళ్లకే ఫ్లాట్ ఫామ్ పై జీవితం.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్..
విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్‌.. ఎవరు అర్హులు..!
విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్‌.. ఎవరు అర్హులు..!