Rashmika Mandanna: చేతిపై టాటూ వేయించుకోవడానికి కారణం అదే.. ఆ విషయాన్ని ఇలా చెప్పేందుకే అంటున్న రష్మిక మందన్నా..
రష్మిక చేతిపై ఓ టాటూ కనిపిస్తుంది. కుడి చేతి పై ఇర్రీప్లేసబుల్ (Irreplaceable) అని టాటూ ఉంటుంది. దీని గురించి చాలాసార్లు అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఈ టాటూ ఎందుకు వేయించుకుంది.. అందుకు గల కారణాలను బయటపెట్టింది.

ప్రస్తుతం దక్షిణాది టూ ఉత్తరాదిలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇటీవల గుడ్ బై సినిమాతో నార్త్ అడియన్స్ ను అలరించింది. ఇక సంక్రాంతి కానుకగా విజల్ దళపతి సరసన వరిసు సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టి్వ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది. అయితే రష్మిక చేతిపై ఓ టాటూ కనిపిస్తుంది. కుడి చేతి పై ఇర్రీప్లేసబుల్ (Irreplaceable) అని టాటూ ఉంటుంది. దీని గురించి చాలాసార్లు అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఈ టాటూ ఎందుకు వేయించుకుంది.. అందుకు గల కారణాలను బయటపెట్టింది.
ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. “నాకు ముందు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు. మా కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిలు బాధను ఓర్చుకోలేరు.. వాళ్లకు సూదులన్నా భయమే అని అన్నాడు. అది తప్పు అని నిరూపించాలనుకున్నాను.. అందుకే వెంటనే టాటూ వేయించుకోవాలని అనుకున్నాను. కానీ ఏం వేసుకోవాలో తెలియలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఎవరూ మరొకరిని భర్తీ చేయలేరు. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. అదే అర్ధం వచ్చేలా ఇర్రీప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నాను ” అంటూ టాటూ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది.




అలాగే సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి స్పందిస్తూ.. మేము సెలబ్రెటీలము. ప్రజలను అలరించడమే మా పని.. ఎప్పుడూ వినోదాత్మకంగా కనిపించేందుకు ట్రై చేస్తుంటాము. ప్రేక్షకులు మేము చేసే పనిని ఎలా చూస్తారు అనేదాని గురించి ఆలోచిస్తుంటారు. మంచి సినిమాలు చేస్తే మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. కేవలం ఒక్క సినిమాతో మా ప్రయాణం ఆగిపోదు. అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
