Rashmika Mandanna: ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక.. నేషనల్ క్రష్ చేతుల మీదుగా ‘ప్రేమిస్తున్నా’ సాంగ్..
ఇక ఇప్పుడు ఈ హీరో బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో వైష్ణవి డీ గ్లామర్ రోల్ పోషించింది. విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీపరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేశారు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా పరిచమయైన ఆనంద్.. ఆ తర్వాత పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ హీరో బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో వైష్ణవి డీ గ్లామర్ రోల్ పోషించింది. విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. ఎస్కే ఎన్ ఈ సినిమాను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. ఇక మంగళవారం ఈ సినిమాను మరో సాంగ్ రిలీజ్ చేశారు.
హైదరాబాద్ – పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ – స్క్రీన్ 1 సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. రష్మిక చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘ప్రేమిస్తున్నా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ప్రేమిస్తున్నా … ప్రేమిస్తున్నా .. నీ ప్రేమలో జీవిస్తున్నా’ అంటూ ఈ పాట సాగే ఈ పాటకు సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా.. రోహిత్ ఆలపించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




