Ramayana Movie: ‘రామాయణ’ ప్రకటనకు ముహుర్తం ఫిక్స్.. ఆ ప్రత్యేక రోజునే ప్రారంభం.. ఎందుకంటే..
రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో న్యాచురల్ స్టార్ సాయి పల్లవి, రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నా..ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఇతిహాస గాథను వెండితెరపై అద్భుతంగా చూపిందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు ఆసక్తిని రేకెత్తిస్తోన్న సినిమా ‘రామాయణ’. హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారతీయ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు నితీష్ తివారీ మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో న్యాచురల్ స్టార్ సాయి పల్లవి, రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నా..ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఇతిహాస గాథను వెండితెరపై అద్భుతంగా చూపిందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నటీనటులందరి లుక్ టెస్ట్ , వాయిస్ టెస్ట్ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రకటన.. ముహుర్తానికి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజున ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారట. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట డైరెక్టర్ నితీష్ తివారీ. ఈ సినిమాను నమి్త మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్ లు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారనే ప్రచారం కూడా వినిపిస్తుంది. ఇటీవలే సాయి పల్లవి ముంబై వెళ్లడంతో రామయాణ సినిమా గురించే అని ప్రచారం నడిచింది. అయితే కొన్ని రోజులకే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని.. సీత పాత్రలో జాన్నీ కపూర్ ను ఎంపిక చేసుకున్నారని టాక్ నడిచింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే తెలుగు, హిందీలో అనేక చిత్రాలు వచ్చాయి. అలాగే బుల్లితెరపై వచ్చిన రామాయణం సీరియల్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కించబోయే రామాయణం ఎలా ఉంటుందో చూసేందుకు అడియన్స్ ఎంతో ఉత్సాహాంగా వెయిట్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా గురించి దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దేశంలోని పలు ప్రాంతాల్లో రామాయణాన్ని అవమానించేలా ఈ సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పడం జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.