Rana Daggubati : ఏనుగులతో ఉన్న రిలేషన్ వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి..
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

aranya pre release event : రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన విక్టరి వెంకటేష్ అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, హీరోయిన్ జోయా హుస్సేన్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. ముందుగా శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు తెలిపాడు. `కెమెరా ముందు ఒక వ్యక్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖర్ కమ్ములగారు ఆయన కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉంది. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచాను అన్నాడు రానా. సాయి మాధవ్‌గారు, క్రిష్‌గారు కలిసి కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధవ్ గారు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది. అది ఏంటంటే `చప్పట్లంటే వ్యసనం..ఆ చప్పట్ల మధ్యన ఒక్కడుంటాడు..దీనమ్మ ఇది నిజమే కదా అని చూస్తుంటాడు..ఆ ఒక్కడికోసం నువ్వు నాటకం ఆడు“ అని ఇప్పుడు ఆ ఒక్కడి కోసమే ఈ సినిమా కూడా చేశాను అన్నాడు రానా.
ఇక వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. నాకు చిన్నానలో ఏదోఒక పార్ట్ అవ్వాలని కోరిక ఉండేది. 11సంవత్సరాల తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను..బాగా యాక్టింగ్ చేయగలుగుతున్నాను అని ఆయన్నిఛీఫ్ గెస్ట్‌గా పిలవడం జరిగింది. ఈ సినిమాలో మా నాన్న పాత్రకి చిన్నాన వాయిస్ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడివిమధ్యలో..ఏనుగుల దగ్గర ఉన్నాను. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ఒక రియల్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఉండే ఎక్స్‌పీరియన్స్ మీకు ఈ నెల 26న అరణ్యతో తెలుస్తుంది. ఆ అడవిలో మనుషులు చేసే అరాచకాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఈ రోజు ఎక్కడ అడివి ఉన్నా సరే ఇలాంటి ఓ సమస్య ఉంది. నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు అడవిలో ఉన్నా.. నాకు ఆ ఏనుగులతో ఉన్న రిలేషన్ వల్ల నా జీవితంలో ప్రతి మనిషితో నాకున్న రిలేషన్ మారిపోయింది. మాములుగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలి అంటారు కాని ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. మీరు ఈ భూమ్మీదే ఉంటారు ఈ భూమికోసం పనిచేస్తే ఆ భూమి తిరిగి మీకు, మీ తరతరాలకు ఇస్తుంది అని ఏనుగులు నేర్పించాయి. ప్రభు సాల్మోన్ ఒక ఫోటో చూసి నన్ను సెలక్ట్ చేశారు. నాకు ఎంతో నేర్పించిన వ్యక్తి ఆయన. ఈ సినిమా థాయిలాండ్, కేరళ, సతార్, మహా భలేశ్వరం,. ఇలా ఆరు అడవులలో తీశాం. ఈ సినిమా మా అందరిలో మార్పు తెచ్చింది. జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన ఎలా ఈజీగా తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు రానా.
మరిన్ని ఇక్కడ చదవండి :
Venkatesh Daggubati : ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ