Venkatesh Daggubati : ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ
యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Aranya Pre Release Event : యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ…రానా పై ప్రసంశలు కురిపించారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత అందరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు వెంకీ. మనందరినీ ప్రకృతి కలిపింది ఈ అరణ్య సినిమా ద్వారా అని అన్నారు వెంకటేష్.
అలాగే ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకృతి లేకుంటే మనం లేము అని అద్భుతంగా చూపించారు దర్శకుడు. ఇక రానా చేసిన సినిమాలన్నీ చూసి రానా ఇంకా నేర్చుకుంటున్నాడు అనుకున్నాను. కానీ అరణ్య సినిమా చూసిన తర్వాత రానా నటన ఆకట్టుకుంది. ఇలాంటి పాత్ర దొరకడం రానా అదృష్టం. నిజంగా రానా ఈ సినిమాలో జీవించేసాడు. ఎదో అనుకున్నా కానీ అద్భుతంగా నటించాడు అంటూ ఎమోషనల్ అయ్యారు వెంకటేష్.అలాగే ‘ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉందన్నారు. ఒక్కరానానే కాదు. విష్ణువిశాల్, జోయా, ప్రియాంకా ఇలా అందరు వారి వారి క్యారెక్టర్స్‌లో లీనమైపోయారు. ఫారెస్ట్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా జంతువుల హవాభాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ చాలా కష్టపడి తీశారు. ఈ టీమ్ అందరు సిన్సియారిటీ, హార్డ్‌వర్క్, డేడికేషన్‌తో ఈ సినిమా చేశారు. మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. అరణ్య సినిమా పెద్ద సక్సెస్ కావాలి“ అన్నారు వెంకటేష్.
మరిన్ని ఇక్కడ చదవండి :