Raai Lakshmi Injured :షూటింగ్‌లో గాయపడిన మెగా ఐటెం భామ… క్వీన్ ఆఫ్ ఇంజురిస్ అంటూ పిక్స్ షేర్ చేసిన రాయ్ లక్ష్మి
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,, ఐటెం సాంగ్స్ తో క్రేజ్ ను సొంతం చేసుకుంది రాయ్ లక్ష్మి. ఈ బామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో సినిమా విషయాలతో పాటు.. హాట్ హాట్ ఫొటోస్..
Raai Lakshmi injured : హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,, ఐటెం సాంగ్స్ తో క్రేజ్ ను సొంతం చేసుకుంది రాయ్ లక్ష్మి. ఈ బామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో సినిమా విషయాలతో పాటు.. హాట్ హాట్ ఫొటోస్ తో అలరిస్తూనే ఉంటుంది. కుర్రకారుని గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. అయితే తాజాగా రాయ్ లక్ష్మి తనకు షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుందని .. ఈ నేపథ్యంలో మార్చి 20 అర్ధరాత్రి షూట్ చేస్తున్న సమయంలో రాయ్ లక్ష్మి కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆమె ఒక్కసారిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ సమయంలో ఆమె పక్కన ఉన్నవారు వెంటనే అలర్ట్ అయ్యి ఆమెను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. షూటింగ్ ను నిలిపివేసి.. రే లక్ష్మిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. లక్ష్మి కి కాలికి గాయమైంది. ఈ విషయాన్నీ తెలుపుతూ.. గాయానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యాక్షన్ ఎపిసోడ్ ఇచ్చిన రిటర్న్ గిప్ట్ అంటూ ఓ కాప్షన్ కూడా ఆ ఫోటో కి జత చేసింది.. ఐటెం భామ.. ఇప్పటికే పలు సార్లు షూటింగ్ సమయంలో గాయపడిన రాయ్ లక్ష్మి .. క్వీన్ ఆఫ్ ఇంజురీస్ అనే బిరుదుని తనకు తానే ఇచ్చుకుంది.. అయితే అభిమానులు, నెటిజన్లు రాయ్ లక్ష్మి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
లక్ష్మి రాయ్ గా శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే హీరోయిన్ గా బాలయ్య వంటి స్టార్ హీరోలతో నటించినా అంతగా కలిసి రాలేదు.. దీంతో ఐటెం సాంగ్స్ కు ఒకే అంది.. పేరు రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. పేరు మార్చుకున్న తర్వాత పవర్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ లో నర్తించే అవకాశం అందుకుంది. దీంతో టాలీవుడ్ లో ఐటెం క్వీన్ గా మారిపోయింది. బలుపు, ఖైదీ నెంబర్ 150 మూవీల్లోనూ రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ మంచి పేరు తెచ్చాయి.
Also Read: గోధుమ పిండి, మైదాల మధ్య తేడా తెలియని నేటి తరం యువత.. వీటిని గుర్తించడం ఎలా అంటే..!