AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas-Rana : ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్.. నెట్టింట వీడియో వైరల్..

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ఇక ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ సైతం తెలుగు చిత్రాల సినిమాల గురించి మాట్లాడేలా చేశాడు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ నటీనటులు ప్రభాస్ అంటే ఎవరు అని అడిగారట.. ఈ విషయాలను రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

Prabhas-Rana : ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్.. నెట్టింట వీడియో వైరల్..
Rana, Prabhas
Rajitha Chanti
|

Updated on: May 05, 2024 | 7:29 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ డార్లింగ్ పేరు మారుమోగింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీతోపాటు.. నార్త్ లోనూ డార్లింగ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే బాహుబలి కంటే ముందు ప్రభాస్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. అప్పట్లో టాలీవుడ్ అంటే.. తెలుగు సినిమాలు అన్నా బాలీవుడ్ కు చిన్న చూపు ఉండేది. అలాగే మన చిత్రాలను అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ బాహుబలి తర్వాత సీన్ మారింది. ఈ మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ఇక ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ సైతం తెలుగు చిత్రాల సినిమాల గురించి మాట్లాడేలా చేశాడు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ నటీనటులు ప్రభాస్ అంటే ఎవరు అని అడిగారట.. ఈ విషయాలను రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

బాహుబలి సినిమా చేస్తున్న సమయంలోనే రానా ఏదో పని మీద బాలీవుడ్ వెళ్లారట. అప్పటికే అక్కడ రానా కొన్ని సినిమాలు చేయడంతో అక్కడి వారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. బాహుబలి సినిమా గురించి వాళ్లతో చెప్పాగా.. బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని అడిగారట. ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే.. ప్రభాస్ ఎవరు ? అని అన్నారని.. వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక మిర్చి, ఛత్రపతి సినిమాలు చూశారా ? అని అంటే చూడలేదని చెప్పారని.. అక్కడి వారికి చిరంజీవి, వెంకటేశ్ మాత్రమే తెలుసునని.. ఈ జనరేషన్ హీరోస్ గురించి అసలు తెలియదని అన్నాడు. ఇక నమ్రత భర్తగా మహేష్ బాబు మాత్రమే తెలుసని అన్నాడు రానా. ప్రస్తుతం రానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

కానీ బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్, డార్లింగ్ కాంబోలో వస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇండియా నుంచి వచ్చే పెద్ద థింగ్ కల్కి అవుతుందని.. అందరూ దీని గురించి మాట్లాడుకుంటారని.. అవేంజర్స్ టైపులో హాలీవుడ్ స్థాయిలో ఉంటుందన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us