AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి.. ట్రోల్స్ పై ఏమన్నారంటే..

సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు.. సాయంత్రాలు సినిమాలకు రండి. కావాలంటే ఐపీఎల్ స్కోర్స్ ను ఆన్లైన్లో చూసుకోవచ్చు అన్నారు.

Anil Ravipudi: ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి.. ట్రోల్స్ పై ఏమన్నారంటే..
Anil Ravipudi
Rajitha Chanti
|

Updated on: May 05, 2024 | 6:41 AM

Share

ప్రస్తుతం దేశవ్యాపంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా మ్యాచ్ హాడావిడిలో ఉంది యూత్. ఈ క్రమంలోనే ఇటీవల కొన్నిరోజులుగా సెలబ్రెటీలు ఏం మాట్లాడిన వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి ఐపీఎల్ టీం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెను దూమారం రేపాయి. అలాగే ప్రసన్న వదనం హీరోయిన్ రాశీసింగ్ చేసిన కామెంట్స్ వివాదం సృష్టించాయి. ఇక టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఐపీఎల్ మ్యాచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు.. సాయంత్రాలు సినిమాలకు రండి. కావాలంటే ఐపీఎల్ స్కోర్స్ ను ఆన్లైన్లో చూసుకోవచ్చు అన్నారు.

దీంతో అనిల్ రావిపూడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్.. క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. సినిమాలు చూడకపోతే కూడా కొంపలేమి మునిగిపోవు.. ఓటీటీలోకి వచ్చాక అయినా చూసుకుంటాము… అయినా సినిమాలకు రావాలంటే డబ్బులు పెట్టాలి.. కానీ క్రికెట్ ఫ్రీగా ఇంట్లోనే చూడొచ్చు.. అంటూ అనిల్ రావిపూడి కామెంట్లకు కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా తన కామెంట్స్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై రియాక్ట్ అయ్యారు అనిల్ రావిపూడి. నిన్న జరిగిన డైరెక్టర్స్ డే సెలబ్రెషన్లలో పాల్గొన్న ఆయన.. ట్రోల్స్ పై స్పందించారు.

“మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆరోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. ఇటీవల నేను మాట్లాడిన మాటలను తప్పుగా తీసుకున్నారు. నేను ఆ ఈవెంట్ కు వెళ్లేముందు ఓ డిస్ట్రిబ్యూటర్ ను కలిసాను. వేసవిలో ఐపీఎల్ వల్ల సినిమాలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్తే.. ఆ ఫ్లోలో అలా మాట్లాడాను. ఐపీఎల్ చూడండి..ఇటు సినిమాలు చూడండి. నేను ఐపీఎల్ చూస్తాను.. నేను మాట్లాడింది తప్పుగా అపార్థం చేసుకోవద్దు” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us