పెద్ద సినిమా ఆఫర్.. బాబోయ్ నావల్ల కాదు అని భయపడింది.. కట్ చేస్తే ఆ సినిమాతోనే విపరీతమైన క్రేజ్..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. అలాగే ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వస్తే బాబోయ్ నావల్ల కాదు అని చెప్పి ఫోన్ పెట్టేసిందట..

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా, అత్తగా కనిపిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన అమ్మడు.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. ఇప్పటికీ అదే అందం.. అదే అభినయం. అప్పట్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిపోయింది. ఆమె ఎవరో తెలుసా.? బడా బడా దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్
ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. సినిమా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు. సినీ పరిశ్రమలో గత 30 ఏళ్లుగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తమిళంలో, నటుడు రజనీకాంత్ పడయప్ప (నరసింహ)లో నీలాంబరి పాత్రను పోషించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత, ఆమె SS రాజమౌళి బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలిలో శివగామి పాత్రను పోషించింది. ఈ సినిమా ఆమెను మరోసారి ప్రేక్షకులకు దగ్గర చేసింది. 45 సంవత్సరాల వయస్సులో, రమ్య కృష్ణ రాజమౌళి బాహుబలి సినిమాతో మెప్పించింది.
బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..
తాజాగా ఆమె జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా అనే షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నుంచి రమ్యకృష్ణకు ఫోన్ చేసి సినిమా గురించి ఎలాంటి విషయాలు చెప్పకుండా 40 రోజులు డేట్స్ అడిగారట.. దాంతో బాబోయ్ 40రోజుల డేట్స్ నావల్ల కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశారట. అప్పుడు ఆమెకు తెలియదట అది బాహుబలి సినిమా అని.. కేవలం భారీ బడ్జెట్ మూవీ మాత్రమే అని చెప్పారట.. చివరకు ఆ సినిమా ద్వారానే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు రమ్యకృష్ణ.
తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








