Ashok Galla’s Hero: మహేష్ మేనల్లుడికోసం రంగంలో ఆ స్టార్ హీరోలు.. ‘హీరో’ ప్రీ రీలీజ్ కు గెస్ట్ లు ఎవరంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ  నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు గల్లా అశోక్. హీరో అనే టైటిల్ .తో తెరకెక్కిన ఈ సినిమా  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ashok Galla's Hero: మహేష్ మేనల్లుడికోసం రంగంలో ఆ స్టార్ హీరోలు.. 'హీరో' ప్రీ రీలీజ్ కు గెస్ట్ లు ఎవరంటే..
Hero
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2022 | 4:22 PM

Ashok Galla’s Hero: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ  నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు గల్లా అశోక్. హీరో అనే టైటిల్ .తో తెరకెక్కిన ఈ సినిమా  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అశోక్ కు జీడీగా అందాల భామ నిధిఅగార్వల్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఏఈ క్రమంలో నేడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మెగాపర్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడు. చరణ్ .తో పాటు దగ్గుబాయి యంగ్ హీరో రానా కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నాడు. స్టార్ డైరెక్టర్ లు కొరటాల శివ.. అనిల్ రావిపూడి .. శివ నిర్వాణ కూడా ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.

అసలైతే ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్  మహేష్ బాబు హాజరుకావాల్సి ఉంది. కానీ మహేష్ కు కరోనా పాజిటివ్ రావడం అంతలోనే మహేష్ అన్న రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూయడంతో మహేష్ బాధలో మునిగిపోయాడు. కరోనా కారణంగా ఎంతగానో ఇష్టపడే అన్న చివరి చూపుకు కూడా మహేష్ బాబు నోచుకోలేదు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ లో మహేష్ లేని లోటును మెగా పవర్ స్టార్ తీరుస్తారేమో చూడలి. అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ నటించిన రౌడీ బోయ్స్ తో పోటీపడుతూ బరిలో దిగుతుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..