Ram Gopal Varma: బర్త్ డే రోజున చావు పాట రిలీజ్.. నా లైఫ్ నా ఇష్టమంటున్న ఆర్జీవీ..

ఆయన ఆలోచనలు అందుకోవడం కాస్త కష్టమే. ఇక ఆయన మాటలకు అర్థం చేసుకోవడం కూడా అంతే. ఎలాంటి సందర్భం అయిన.. తాను అనుకున్న మాటలను సూటిగా చెప్పేస్తారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రశంసలు అందుకుంటారు.. మరికొన్ని విమర్శలు ఎదుర్కొంటారు.

Ram Gopal Varma: బర్త్ డే రోజున చావు పాట రిలీజ్.. నా లైఫ్ నా ఇష్టమంటున్న ఆర్జీవీ..
Rgv
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2023 | 7:58 PM

బర్త్‌డే రోజు ఎవరైనా ఏం చేస్తారు… హ్యాపీ బర్త్‌డే సాంగ్‌తో ఎంజాయ్‌ చేస్తారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్‌ అవుతారు. సంతోషంగా గడుపుతారు. కానీ, ఆర్జీవీ డిఫరెంట్‌గా తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఎలాగంటే చూస్తేనే మనకు మతిపోయేలా!. బర్త్‌డే రోజు చావు పాట విడుదల చేశాడు. వర్మ ఏం చేసిన సంచలనమే అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆలోచనలు అందుకోవడం కాస్త కష్టమే. ఇక ఆయన మాటలకు అర్థం చేసుకోవడం కూడా అంతే. ఎలాంటి సందర్భం అయిన.. తాను అనుకున్న మాటలను సూటిగా చెప్పేస్తారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రశంసలు అందుకుంటారు.. మరికొన్ని విమర్శలు ఎదుర్కొంటారు వర్మ.

కానీ అవేం పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. ఎప్పుడూ నా లైఫ్ నా ఇష్టమంటూ ఉండే ఆర్జీవికి అభిమానులు ఎక్కువే. ఆయన ఫిలాసఫి ఇష్టపడేవారు కూడా అంతే సంఖ్యలో ఉంటారు. ఏప్రిల్ 7 వర్మ పుట్టినరోజు. నా బర్త్ డే రోజున నాకు విష్ చేయకండి అంటూనే.. పుట్టినరోజున చావు పాటను రిలీజ్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అయినా అందరూ చేసేదే ఆర్జీవీ చేస్తే ఆయన రాంగోపాలవర్మ ఎందుకవుతారు?. అందుకే, పుట్టినరోజు నాడు… తన చావుపై డెత్‌ డే సాంగ్‌ రిలీజ్‌ చేసుకున్నాడు. ఆర్జీవిజమ్‌, ఏ ట్రిబ్యూట్‌ టు రాంగోపాలవర్మ అంటూ మొదలైన ఆర్జీవీ డెత్‌ సాంగ్‌…. నా లైఫ్‌ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నాకు ఇష్టమొచ్చినట్టు బతుకుతా, మీరెవరు నన్ను అడగడానికంటూ రాంగోపాలవర్మ మాట్లాడుతోన్న మాటలతో ఎండ్‌ అయ్యింది. ఆర్జీవీ డెత్‌ సాంగ్‌ను మీరూ చూడండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.