ట్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్.. కొమురం భీం పాత్రలో తారక్ తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు దేశమే కాదు.. ప్రపంచమే ఫిదా అయ్యాయి. థియేటర్లు.. ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు విదేశాల్లోనూ దూసుకుపోతుంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోగల చైనీస్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే అక్కడ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అలాగే రాజమౌళితో ప్రశ్నల సెషన్ కోసం భారీగా అభిమానులు విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అమెరికాలో జక్కన్న క్రేజ్ చూసి సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.
తాజాగా.. రాజమౌళి క్రేజ్ చూసి రామ్ చరణ్ సైతం ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ వన్ అండ్ ఓన్లీ.. ఎస్ఎస్ రాజమౌళి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే.. జక్కన్న క్రేజ్ చూసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షాకయ్యారు. అమెరికాలో రాజమౌళి అభిమానగణాన్ని చూసి తనకు గూస్ బంప్స్ వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగిపోయింది.
ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దక్షిణాదికి పరిచయం కాగా.. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
One and Only @ssrajamouli Garu ❤️🙏 pic.twitter.com/FHOXTfyDQK
— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.