Nani: రేపటి సంది దుమ్ము లేసిపొద్ది అంటోన్న నాని.. దసరా మాస్‌ సాంగ్‌ను లీక్‌ చేసిన న్యాచురల్‌ స్టార్‌..

నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తెలంగాణలోని రామగుండం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. పక్కా లోకల్‌ సినిమా తర్వాత...

Nani: రేపటి సంది దుమ్ము లేసిపొద్ది అంటోన్న నాని.. దసరా మాస్‌ సాంగ్‌ను లీక్‌ చేసిన న్యాచురల్‌ స్టార్‌..
Nani Dasara Movie Song
Follow us

|

Updated on: Oct 02, 2022 | 6:52 PM

నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తెలంగాణలోని రామగుండం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. పక్కా లోకల్‌ సినిమా తర్వాత ఈ జోడి కలిసి నటిస్తోన్న చిత్రం ఇది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సినిమాలోని మాస్‌ సాంగ్‌ను సోమవారం విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నాని ఈ పాటకు సంబంధించి చిన్న గ్లింప్స్‌ను ట్వీట్ చేశారు. ఊరమాస్‌ స్టెప్పులు వేస్తుండగా దుమ్ము లేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసిన నాని.. ‘పాట చిత్రీక‌రిస్తున్నపుడు నా ఫోన్‌లో రికార్డు చేసిన ఒక విజువ‌ల్‌ను లీక్ చేస్తున్నా.. రేపటి సంది దుమ్ము లేసిపోద్ది’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో నాని పక్కా తెలంగాణ స్లాంగ్‌ మాట్లాడనున్నాడని ఈ ట్వీట్‌తో చెప్పకనే చెప్పారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నాని ఫుల్‌ లెంత్‌ మాస్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. జ‌రీనా వ‌హ‌బ్, సాయికుమార్, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. 2023 మార్చి 30న విడువలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..