Adipurush Teaser: ‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ క్రేజ్‏కు దద్దరిల్లిన అయోధ్య..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 02, 2022 | 7:15 PM

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు విజువల్ వండర్ ఇచ్చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

Adipurush Teaser:  ‘ఆదిపురుష్’  టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ క్రేజ్‏కు దద్దరిల్లిన అయోధ్య..
Adipurush Teaser

+దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలోని సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు. ముందు నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. రాముడిగా ప్రభాస్ లుక్‏ అదిరిపోయింది. మొదటిసారి డార్లింగ్‎ను శ్రీరాముడి పాత్రలో చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అలాగే రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ అదరగొట్టారు. ముఖ్యంగా డార్లింగ్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేశారు డైరెక్టర్ ఓంరౌత్. అలాగే సీతగా కృతి సనన్ చూపు తిప్పుకొనివ్వకుండా ఆకట్టుకుంది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలతోపాటు.. అంతర్జాతీయ భాషలలోనూ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu