Ram Charan: చరణ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయినట్టేనా.. శంకర్ తర్వాత ఆ దర్శకుడితో రామ్ చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నాడు. చిన్న గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టనున్నాడు

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నాడు. చిన్న గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించాడు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను ఈ సినిమాలో కలిపి చూపించే సాహసం చేస్తున్నాడు జక్కన. చరణ్ రామరాజుగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు చాలా కష్టపడ్డారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు జక్కన. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే శంకర్ సినిమాను కన్ఫామ్ చేశాడు చరణ్. టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో చరణ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులను మొదలు పెట్టాడు శంకర్. ఈ మూవీలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.
ఈ మూవీ గతంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్‌మ్యాన్ సినిమాకు సీక్వెల్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు దీనిపైన క్లారిటీ అయితే రాలేదు. ఇక చరణ్ జర్సీ దర్శకుడితో సినిమా చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. నాని నటించిన జర్సీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇపుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా దాదాపు సెట్ అయినట్టే అని అంటున్నారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి చరణ్‌కి ఒక కథను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకి చరణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. శంకర్ తరువాత చరణ్ చేయనున్న సినిమా ఇదేనని టాక్ .
మరిన్ని ఇక్కడ చదవండి :