Ram Charan: నా జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలివి..మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కామెంట్స్..
యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ లోని పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది.

మెగా పవర్‌స్టార్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం యుఎస్ వెళ్లిన ఆయన.. ఇటీవలే గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు చెర్రీ. యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ లోని పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది.
లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. KTLAకి చెందిన శామ్ రూబిన్ వెర్సటైల్ యాక్షన్ హీరో రామ్ చరణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేషన్స్ గురించి, ప్రస్తుతం ఆయన ఆలోచనా విధానంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ చేయబోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి అందరిలోనూ తెలియని ఎగ్జయిట్‌మెంట్ నెలకొంది. RRR మేకింగ్ సమయంలో జరిగిన మ్యాజిక్ గురించి ‘నాటు నాటు..’ సాంగ్ తెరకెక్కించేటప్పుడు కలిగిన ఎక్స్‌పీరియెన్స్ గురించి రామ్ చరణ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.




“నాటు నాటు” సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు రావటం ఆస్కార్‌కి ఎంపిక కావటం ఎలా అనిపిస్తుంది. అని ప్రశ్నించగా.. చరణ్ స్పందిస్తూ.. ” నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ అతిథిగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నామినేట్ అయ్యాను. నేను ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లటానికి చాలా ఎగ్జయిట్మెంట్‌తో ఎదురు చూస్తున్నాను. మార్చి 3న మా సినిమా యు.ఎస్‌లో రీ రిలీజ్ అవుతుంది. సినిమా కచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Soaking in the LA vibe! Thank you @ktlaENT for having me. @RRRMovie back in theatres all across the United States starting March 3, catch us on the big screens once again pic.twitter.com/rlhlcDXwte
— Ram Charan (@AlwaysRamCharan) March 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
