Ram Charan: గేమ్ ఛేంజర్ కథ పవన్ కళ్యాణ్ గారిదే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంద్రప్రదేశ్ రాజమహేంద్రవరం సమీపంలోని కడియం వేమగిరి లే అవుట్ లో జరిగింది. ఈ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందించిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఎస్ జే సూర్య విలన్‌గా నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ మూవీ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిదే అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. ఈ జన సంద్రాన్ని చూస్తుంటే ఇంతకు ముందు రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జీ మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో ఇవాళ అంతే జనాలు వచ్చి జనసంద్రం అయ్యింది. ఇప్పుడు అదే సంగతి గుర్తుకు వస్తుంది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు చేశాం. ఈ వేడుకలో చాలా మాట్లాడాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ముందు మీరు, వెనుక బాబాయి ఉండటంతో నాకు మాటలు రావడం లేదు.
శంకర్ గారు ఈ సినిమాకు ఎందుకని గేమ్ ఛేంజర్ అని టైటిల్ పెట్టారో తెలియదు కానీ, ఏపీలోనే కాకుండా, ఇండియన్ పొలిటిక్స్‌లో ఉన్న ఏకైక గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ గారు. తెర మీద మేము చేసే పాత్ర గేమ్ ఛేంజింగ్ పాత్ర కావచ్చు.. కానీ అసలైన గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన పక్కన నేను నిల్చోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడే వ్యక్తి కుటుంబానికి నేను చెందిన వాడిని కావడం, ఆయన కుటుంబంలోనే నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. శంకర్ గారు గేమ్ ఛేంజర్ కథను పవన్ కళ్యాణ్ గారి వంటి వ్యక్తులను చూసి రాశారు. ఇంకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేక పోతున్నాను. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు వినాలని ఎదురు చూస్తున్నాను’ అన్నారు.’
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.