- Telugu News Photo Gallery Cinema photos SSMB29 to Sai Pallavi Next Movie latest film updates from industry
Movie Updates: అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమా అధికారికంగా లాంఛ్ అయింది. చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్లో మరో సినిమాకి సాయి పల్లవి గ్రీన్ సింగల్. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి కొన్ని సినిమా అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Jan 06, 2025 | 1:30 PM

మహేష్ బాబు, రాజమౌళి సినిమా అధికారికంగా లాంఛ్ అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరిగాయి. అయితే దీనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. దానికి కారణం ఈ సినిమా కోసం మహేష్ బాబు చేసిన స్పెషల్ లుక్ అని తెలుస్తుంది. అది బయటికి రాకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే ఈ ఈవెంట్ ఫోటోలు విడుదల చేయలేదు మేకర్స్.

చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో పర్ఫెక్ట్ మీటర్‌లో ఉండే ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఓ భారీ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా కోసం చిరు 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం విలన్ కోసం వేట సాగుతోంది. స్కామ్ 1992తో ఆకట్టుకొన్న ప్రతీక్ గాంధీతో పాటు తమిళ నటుడు విక్రాంత్ పేర్లను విలన్ కోసం పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో ప్రతీక్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్.

నిన్నమొన్నటి వరకు సౌత్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. అక్కడే రెండు సినిమాలు చేస్తున్నారు. రామాయణ్‌లో సీతగా నటిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమీర్ ఖాన్ కొడుకు సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ విషయం ఎప్పుడో బయటికి వచ్చినా.. అధికారికంగా ఇప్పుడు ఖరారు చేసారు హీరో జునైద్.

బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఆరేళ్ళలో చాలా సార్లు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు సాజిద్ ఖాన్. ఈయనపై కొన్నేళ్ల కింద మీటూ ఆరోపణలు వచ్చాయి.. ఆ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న హౌజ్ ఫుల్ 4 నుంచి తప్పించారు.. ఇవన్నీ చూసాక చచ్చిపోవాలనుకున్నట్లు తెలిపారు సాజిద్. ఆ తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకున్నట్లు తెలిపారు.




