AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana:త్వరలోనే మా అత్తామామల ఇంటికి షిఫ్ట్‌ అవుతున్నాం.. మా బిడ్డకు ఆ ఆనందం దక్కాలి: ఉపాసన

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు. పెళ్లైన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా వారసుడు/ వారసురాలి కోసం ఆ కుటుంబంతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Upasana:త్వరలోనే మా అత్తామామల ఇంటికి షిఫ్ట్‌ అవుతున్నాం.. మా బిడ్డకు ఆ ఆనందం దక్కాలి: ఉపాసన
Mega Family
Basha Shek
|

Updated on: Jun 16, 2023 | 7:12 AM

Share

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు. పెళ్లైన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా వారసుడు/ వారసురాలి కోసం ఆ కుటుంబంతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే తాము అత్తా మామాల (చిరంజీవి- సురేఖ) ఇంటికి షిఫ్ట్‌ అవుతున్నట్లు ఉపాసన తెలిపింది. ఇప్పటివరకు తాము (రామ్‌ చరణ్‌, ఉపాసన) వేరు కాపురం ఉన్నామని, అయితే పుట్టబోయే బిడ్డ సంరక్షణను దృష్టిలో ఉంచుకుని అత్తా మామాల ఇంటికి వెళుతున్నట్లు ఉపాసన పేర్కొంది. తమ 11 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఓ ఇంటర్వూకు హాజరైన ఉపాసన తన ప్రెగ్నెన్సీ, పుట్టబోయే బిడ్డపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ ప్రస్తుతం రామ్‌ చరణ్‌, నేనూ.. అత్తామామాలతో కాకుండా విడిగా ఉంటున్నాం. అయితే త్వరలోనే మేం అత్తామామాల ఇంటికి వెళుతున్నాం. వారితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. చరణ్‌ కానీ, నేనయినా ఈ స్థాయికి చేరుకున్నామంటే అది మా గ్రాండ్‌ పేరెంట్సే కారణం. వాళ్ల నుంచి మేం ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందం, సంతోషాన్ని మేం మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉపాసన చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.