Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్… జిమ్ లో చెమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 21, 2021 | 8:31 AM

అందాల రకుల్ దూకుడు ఈ మధ్య కాస్త తగ్గిందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది.

Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్... జిమ్ లో చెమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్
Rakul

Follow us on

Rakul Preet Singh: అందాల రకుల్ దూకుడు ఈ మధ్య కాస్త తగ్గిందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఈ మధ్య కాలంలో రకుల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 రకుల్ అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. అలాగే మహేష్ తో చేసిన స్పైడర్, రీసెంట్ గా వచ్చిన చెక్ సినిమాలు ప్రేక్షుకులను ఆకట్టుకోకపోవడంతో రకుల్ కు ఆఫర్లు తగ్గాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం రకుల్ తెలుగుతోపాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలపైన దృష్టి పెడుతుంది. అయితే సినిమాలతోపాటు ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ అభిమానులను ఆకట్టుకొంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో ఎంత కేర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది ఈ బ్యూటీ.

తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తోన్న మరో కొత్త వీడియోను షేర్ చేసింది. డంబెల్స్ ఎత్తడం నుంచి కిక్ బాక్సింగ్ వరకూ ప్రతిదీ ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫిట్ నెస్ కోసం ఈ ముద్దుగుమ్మ పడుతున్న కష్టానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రకుల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హిందీలో పలు సినిమా చేస్తోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `మేడే` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుత, షూటింగ్ దశలో ఉంది. అలాగే `సర్ధార్ కా గ్రాండ్సన్` అనే సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఇక్కడ చదవండి :

‎Aha : అదిరిపోయే కంటెంట్‌‌‌‌తో దూసుకుపోతోన్న ఆహా.. త్వరలో మరో ఆసక్తికర సినిమాతో..

Mehreen: అనుకోకుండా మంచి రోజులు వచ్చాయంటోన్న మెహ్రీన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెడన్‌గా ప్రకటన..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu