‎Aha : అదిరిపోయే కంటెంట్‌‌‌‌తో దూసుకుపోతోన్న ఆహా.. త్వరలో మరో ఆసక్తికర సినిమాతో..

సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో తెలుగు ప్రేక్షకుల చేత ఆహా అనిపించుకుంటుంది తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.  ప్రతి వారం సరికొత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది..

‎Aha : అదిరిపోయే కంటెంట్‌‌‌‌తో దూసుకుపోతోన్న ఆహా.. త్వరలో మరో ఆసక్తికర సినిమాతో..
Aha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2021 | 6:55 AM

‎Aha : సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో తెలుగు ప్రేక్షకుల చేత ఆహా అనిపించుకుంటుంది తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ప్రతి వారం సరికొత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. తెలుగు సినిమాలనే కాకుండా ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తోంది ఆహా. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందించి అలరిస్తోంది. ఇప్పటికే మిగిలిన ఓటీటీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది.. సినిమాలతోనే కాదు టాక్ షోలతోనూ ఆకట్టుకుంటోంది. సమంత అక్కినేని హోస్ట్ గా వ్యవహరించిన టాక్‌ షో సామ్‌ జామ్‌, తమాషా విత్‌ హర్ష అంటూ వైవా హర్ష వ్యాఖ్యాతగా చేసిన షోతో పాటు రానా దగ్గుబాటి హోస్ట్‌ చేసిన నెంబర్‌ వన్‌ యారి వంటి టాక్‌ షోలతో, నాన్‌ ఫిక్షనల్‌ కంటెంట్‌తో తెలుగు డిజిటల్ మాధ్యమంలో కొత్త శకానికి తెర తీసింది ఆహా. అలాగే మంచు లక్ష్మి హోస్ట్ గా ఆహా భోజనంబు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆహా. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న’నిజాల్’ అనే మిస్టరీ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించడానికి ఆహా సిద్ధం అయ్యింది. నయనతార-కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఆహా. జూలై 23న ఈ  సినిమా ను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

తాజాగా నీడ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు ఆహా వారు. ఈ సినిమాకు  అప్పు ఎన్. భట్టాత్రి దర్శకత్వం వహించారు. ఇక మిస్టరీ థ్రిల్లర్ రూపొందిన నీడ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే .. స్కూల్ లో ఓ పిల్లాడు చెప్పిన థ్రిల్లింగ్ మర్డర్ కథ విని మిగతా పిల్లలు అందరూ వణికిపోయారని ఓ యువతి చెబుతూ ఉండగా.. కుంచాకో బోబన్ ఆ కథ ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత స్టోరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా సాగింది. పిల్లాడు చెప్పిన కథ వెనకున్న మిస్టరీని కనుక్కునే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గా కుంచాకో కనిపిస్తున్నాడు. పిల్లాడి తల్లిగా లేడీ సూపర్ స్టార్ నయన తార కనిపించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి ..

మరిన్ని ఇక్కడ చదవండి :

Mehreen: అనుకోకుండా మంచి రోజులు వచ్చాయంటోన్న మెహ్రీన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెడన్‌గా ప్రకటన..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ ఫోటో వైరల్.. భీమ్‌ని విడిపించిన రామరాజు.. ఈ సన్నివేశం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!