Rakul Preet Singh: ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో ఛాన్స్.. కానీ చెప్పకుండానే తీసేశారు.. రకుల్ ప్రీత్ కామెంట్స్..
కానీ నెమ్మదిగా తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన రకుల్.. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇక్కడ ఆఫర్స్ గురించి కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. చివరగా వైష్ణవ్ తేజ్ జోడిగా కొండపొలం మూవీలో కనిపించింది. కానీ నెమ్మదిగా తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన రకుల్.. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇక్కడ ఆఫర్స్ గురించి కామెంట్స్ చేసింది.
యూట్యూబర్ రణ్వీర్ అలహబాడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. తెలుగులో అనేక సినిమాలు చేజారిపోయాయని తెలిపింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని.. కానీ చెప్పకుండానే తొలగించారని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో నటించే ఛాన్స్ వచ్చిందని సంతోషించానని.. నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే తన స్థానంలోకి మరొకరిని తీసుకువచ్చారని తెలిపింది. ప్రభాస్ తో వచ్చిన సినిమా చేస్తే అదే తనకు తెలుగు సినిమా అయ్యేదని.. కొనీ కొన్నిసార్లు సినీ పరిశ్రమ గురించి పెద్ద తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది.
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తన షెడ్యూల్ కంప్లీట్ చేసి ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆ విషయం తెలిసిందని.. అలాగే మరో ప్రాజెక్టులోనూ అలాగే జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ సంతకం చేసి .. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే తొలగించారని తెలిపింది. అక్కడ ఆటిట్యూడ్ సమస్య ఉందా లేదా నటన తెలియదని తీసేసారా అని అనుకున్నానని చెప్పుకొచ్చింది. 2009లో గిల్లీ మూవీతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెరిసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.