AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vettaiyan OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి సూపర్ స్టార్ సినిమా.. వెట్టయన్ వచ్చేది అప్పుడేనా.?

ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలైంది. వెట్టయన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి.

Vettaiyan OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి సూపర్ స్టార్ సినిమా.. వెట్టయన్ వచ్చేది అప్పుడేనా.?
Vettaiyan
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2024 | 4:02 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయన్. జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలైంది. వెట్టయన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఓటీటీలోకి ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెట్టయన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం వెట్టయన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రితికా సింగ్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిషోర్, తుషార విజయన్, రక్షణ  ఇలా చాలా మంది నటించారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

ఈ సినిమాలో రజనీ విభిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రేమ, హత్య కేసులు, భావోద్వేగాలతో కూడిన యాక్షన్ సినిమా వెట్టయన్. ఈ సినిమాలో రజనీ భార్యగా నటి మంజువారియర్ నటించారు.ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 86 కోట్లకు పైగా వసూలు చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 240 కోట్లకు పైగా బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రజనీకాంత్ సినిమా వెట్టయన్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జైలర్‌లాగే ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించింది కాబట్టి. రూ. 90 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని అంటున్నారు. వెట్టయన్  చిత్రం అమెజాన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 7 న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఈ హోటల్స్‌కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్‌లో వెయ్యాల్సిందే.. ఎందుకో..
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ vs నేచురల్ షుగర్: ఏది ఎక్కువ సేఫ్?
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్.. స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
20ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నపెంగ్విన్‌..!
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
HYDలో ఉన్న ఆ థియేటర్ నాదే.. మాకంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
జయ ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
చెన్నై ఫ్యాన్స్‌కు మస్త మాజా ఇచ్చే న్యూస్.. కొత్త పాత్రలో ధోని..?
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
క్లైమాక్స్ చెప్పగానే నవ్వేశారు.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్
హైదరాబాద్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. సీపీ వార్నింగ్