AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad : నాకు ఈ బిక్షను ప్రసాదించిన నా దేవుడు.. ఎన్టీఆర్‌ను స్మరించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. 

నేడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్

Rajendra Prasad : నాకు ఈ బిక్షను ప్రసాదించిన నా దేవుడు.. ఎన్టీఆర్‌ను స్మరించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. 
Rajendra Prasad
Rajeev Rayala
|

Updated on: May 28, 2022 | 3:57 PM

Share

నేడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. తెలుగు ప్రజలు అభిమానంతో ఎంటోడు అంటూ పిలుచుకునే ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా సినీ నటులు, సన్నిహితులు, రాజకీయ నేతలు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన మధుర స్మృతులను తలుచుకుంటున్నారు. పలువురు సినిమా తారలు, రాజకీయనేతలు ఎన్టీఆర్ ఘాట్ ని దర్శించుకొని నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ ని దర్శించుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం ఈ రోజున ఆయనను తలుచుకుంటున్నారు.. ఆయన పుట్టిన మట్టిలోనే పుట్టిన అదృష్టం కలిగినవాడిగా.. వారి ద్వారా మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి.. ఆయన చూపిన దారిలో.. ఆయన ఇచ్చిన సలహాలకు తగినట్టుగా.. ఈ రోజున మీముందు ప్రత్యక నటుడిగా మీముందు నుంచున్న నాకు.. ఆ బిక్షను ప్రసాదించిన.. నా దేవుడు ఎన్టీఆర్ అన్నారు రాజేంద్ర ప్రసాద్.

అలాగే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పూజ్యులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నాకు ప్రపంచ నలు మూలాల నుంచి నన్ను రమ్మని ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుందాం అని పిలిచారు. ఆయన మా ఇంట్లో మనిషి అంటూ.. నన్ను ఆహ్వానించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్నగారి పేరుమీద అన్నదానాలు జరుగుతున్నాయి. తెగులు జాతి గర్వించదగిన ఒక మహానుభావుడు.. తెలుగు జాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహనీయుడు ఎన్టీఆర్.. అలాంటి ఆయనను  మీరందరు తలుచుకుంటున్నారంటే. ఆయనకు చాలా సంతోషంగా ఉండుంటారు.. కొన్ని సంవత్సరాలపాటు ఆయన పక్కనే ఉండి శిష్యరికం చేసిన వ్యక్తిగా.. చిరాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్నారు అంటూ అన్నగారిని స్మరించుకున్నారు రాజేంద్ర ప్రసాద్.

ఇవి కూడా చదవండి

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు

Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ

Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!