NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినీ నటులు, సన్నిహితులు, రాజకీయ నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్స్ మెగా స్టార్ చిరంజీవి, టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ ను జ్ఞాపకం చేసుకుంటూ.. నివాళులర్పించారు.
NTR Jayanti 2022: తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా చెరగని ముద్ర వేసిన అన్న ఎన్టీఆర్.. రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించారు. నేడు ఆయన సందర్భంగా సినీ నటులు, సన్నిహితులు, రాజకీయ నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్స్ మెగా స్టార్ చిరంజీవి, టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ ను జ్ఞాపకం చేసుకుంటూ.. నివాళులర్పించారు.
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం నందమూరి తారక రామారావు.. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళని సోషల్ మీడియా వేదికగా తెలిపారు చిరు. అంతేకాదు.. #100YearsOfNTR తో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి కెరీర్ మొదట్లో వెండి తెరను పంచుకున్నారు. తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్, చిరులు కలిసి నటించారు.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతికి ఘన నివాళులర్పించారు. ఎన్.టి.రామారావు అభ్యుదయవాది అని .. తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్.టి.రామారావు కూడా ఒకరని కీర్తించారు. బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాది ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ఎ జయంతి సందర్భంగా తాను, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి