Raj Tarun- Lavanya: రాజ్‌తరుణ్- లావణ్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. A1, A2 గా ఎవరిని చేర్చారంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ మాజీ ప్రియురాలు లావణ్య, అలాగే తన సోదరుడికు మెసేజుల పంపుతుందంటూహీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ మాజీ ప్రియురాలు లావణ్య, అలాగే తన సోదరుడికు మెసేజుల పంపుతుందంటూహీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని టీవీ9 సంపాదించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1గా రాజ్‌తరుణ్ ఉంటే.. A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్‌తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి.. ఇటీవలి వరకూ ఏం జరిగిందో పేర్కొంది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన. 2010లో రాజ్‌తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు.. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది. అలాగే రాజ్‌తరుణ్‌కు తాను గతంలో 70 లక్షలు ఇచ్చానంటోంది.
2016లో రాజ్‌తరుణ్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, అయితే రెండో నెలలోనే అబార్షన్ చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్‌తరుణ్, మాల్వీ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. మరోవైపు హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారంటోంది లావణ్య.
తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్ తో హీరోయిన్ మాల్వి మల్హోత్రా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.