AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. పెళ్లి చేసుకునే అభిమానులకు భారీ సాయం..

గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సిక్వెల్‏గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో లారెన్స్, ఎస్జే. సూర్య ప్రధాన పాత్రలలో 'జిగర్ తండ డబుల్ ఎక్స్' సినిమాలో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా సక్సె్స్ మీట్ చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, ఎస్జే. సూర్య, లారెన్స్ పాల్గొన్నారు.

Raghava Lawrence: మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. పెళ్లి చేసుకునే అభిమానులకు భారీ సాయం..
Raghava Lawrence
Rajitha Chanti
|

Updated on: Dec 03, 2023 | 10:52 AM

Share

కొరియోగ్రాఫర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్ గురించి పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన లారెన్స్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సిక్వెల్‏గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో లారెన్స్, ఎస్జే. సూర్య ప్రధాన పాత్రలలో ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా సక్సె్స్ మీట్ చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, ఎస్జే. సూర్య, లారెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం కీలకనిర్ణయం తీసుకున్నారు లారెన్స్.

లారెన్స్ మంచి మనసు గురించి చెప్పాల్సి్న అవసరం లేదు. ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. ఎంతోమంది అనాథలను అక్కున చేర్చుకుని వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పుడు అభిమానుల కళ్లలో సంతోషం చూసేందుకు ముందుకు వచ్చారు. జిగర్ తండా విజయోత్సవ కార్యక్రమంలో లారెన్స్ మాట్లాడుతూ.. వివాహం చేసుకోబోయే అభిమానులకు భారీ సాయమందించారు. జిగర్ తండా సినిమా మంచి విజయాన్ని అందించిందని.. ఇందులో అసలైన హీరో మాత్రం కార్తీక్ సుబ్బరాజు అని అన్నారు. అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని.. వారందరూ తన కుటుంబసభ్యులే అని అన్నారు.

“సినిమా విడుదలైన ప్రతిసారి అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ఈసారి మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలోనే నిర్మించబోతున్నారు. అందులో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే.. ఇంతకు ముందు నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇస్తూ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి ఎక్కడ అని అడిగితే ఇంట్లోనే.. కానీ సరైన వసతి లేదు. కళ్యాణమండపంలో చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదని అన్నాడు. పెళ్లి సమయంలో అతని ముఖంలో సంతోషం లేదు. అందుకే మా అమ్మ పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో లారెన్స్ గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.