AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: తనకు నేనున్నా.. వివరాలు చెప్పండి.. డబ్బులు పంపిస్తా.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్

ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు కొరియో గ్రాఫర్, హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఇప్పటకే ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన అతను మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో లారెన్స్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

Raghava Lawrence: తనకు నేనున్నా.. వివరాలు చెప్పండి.. డబ్బులు పంపిస్తా.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్
Raghava Lawrence
Basha Shek
|

Updated on: Sep 11, 2025 | 7:36 PM

Share

‘దైవం మనూష్య రూపేణా’.. అన్న మాటలను అక్షరాలా నిజం చేస్తున్నాడు స్టార్ కొరియో గ్రాఫర్, హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఈ మధ్యన తన సినిమాల కంటే సామాజిక సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడీ రియల్ హీరో. సొంతంగా వృద్ధ, అనాథశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి నీడను అందిస్తున్నాడు. అలాగే అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నాడు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నాడు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చి ఆమె కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు లారెన్స్. చెన్నైలో లోకల్ ట్రైన్స్ లో దాదాపు శ్రీ రాఘవేంద్ర అనే 80 ఏళ్ల వృద్ధుడు మిఠాయిలు విక్రయించడం ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన భార్య చేసిన స్వీట్లను ట్రైన్స్ లో అమ్మి పొట్ట నింపుకొంటున్నాడు. ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఒక యూజర్.. ‘ ఆస్తి, ఆదాయం లేకుండా, పెన్షన్ లేకుండా 80 ఏళ్ల వయసులో కూడా కష్టపడి జీవిస్తున్నారు. ఆయన స్వీట్స్ ప్యూర్, డివైన్, లవ్‌తో నిండినవి. వారిని చూస్తే కేవలం కొనకండి, వారి ధైర్యాన్ని కొనండి’ అని రాశాడు. ఈ పోస్ట్ లక్షలాది మందిని కదిలించింది. వృద్దుడి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. పలు మీడియా న్యూస్ ఛానెన్స్ లోనూ ఆ వృద్ధుడి గురించి ప్రత్యేక కథనాలు ప్రసారమమయ్యాయి.

ఇవి కూడా చదవండి

చివరకు ఆ వృద్ధుడి ఫొటోలు, వీడియోలు నటుడు లారెన్స్ దాకా కూడా వెళ్లాయి. దీంతో అతను చలించిపోయాడు. అతనికి ఎలాగైనా సాయం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నాకు చేరింది. చెన్నైలో 80 ఏళ్ల మనిషి, అతని భార్య స్వీట్స్, పోలీలు (స్వీట్స్) తయారు చేసి ట్రైన్‌లలో అమ్ముతూ జీవిస్తున్నారు. వారి ధైర్యం నన్ను బాగా కదిలించింది. వారి జీవితానికి సపోర్ట్‌గా రూ. 1,00,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ సహాయం వారికి సౌకర్యం, బలం ఇస్తుందని ఆశిస్తున్నాను. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఎవరైనా వారి డీటెయిల్స్ తెలిస్తే నాకు చెప్పండి. మీరు కూడా ట్రైన్‌లో వారిని చూస్తే వారి స్వీట్స్ కొని సపోర్ట్ చేయండి’ అని ఎక్స్ లో రాసుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా బాగా వైరలవుతోంది.

రాఘవ లారెన్స్ పోస్ట్..

సొంత ఇంటిని పాఠశాలగా..

దీంతో పాటు విద్యార్థుల చదువు కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు లారెన్స్. తన సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్టు  ప్రకటించాడు. దీని ద్వారా మరికొంత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం నటిస్తున్న ‘కాంచన 4’ సినిమా అడ్వాన్స్‌తో ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టానని చెప్పారు. ఆ ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థి.. త్వరలో ప్రారంభం కానున్న ఆ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహించనున్నాడని లారెన్స్ తెలిపాడు.

విద్యార్థులతో లారెన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..