AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam Collection: ఫస్ట్ డే దుమ్మురేపిన ప్రభాస్.. మాసీవ్ ఓపెనింగ్స్.. ఏరియాల వారీగా కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా శుక్రవారం(మార్చి11న) గ్రాండ్‌గా రిలీజయ్యింది. అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట డే కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం.....

Radhe Shyam Collection: ఫస్ట్ డే దుమ్మురేపిన ప్రభాస్.. మాసీవ్ ఓపెనింగ్స్.. ఏరియాల వారీగా కలెక్షన్స్
Radhe Shyam
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 12, 2022 | 5:58 PM

Share

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా శుక్రవారం(మార్చి11న) గ్రాండ్‌గా రిలీజయ్యింది. అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను అలరించే కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ డ్రా బ్యాక్ అని చెబుతున్నారు. అయితే ఓ వర్గం క్లాస్ ఆడియెన్స్‌ను మాత్రం ఈ మూవీ  మెప్పిస్తోంది. వరల్డ్‌వైడ్‌గా 7 వేలకు పైగా స్క్రీన్స్​లో ఈ మూవీ రిలీజ్​ అయింది. ప్రేమ‌కీ, విధికీ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి.  ప్రభాస్ సరసన​ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కృష్ణంరాజు కీలక పాత్రలో నటించారు.  ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా విడుదలకు ముందుగానే టికెట్స్‌ బాగా అమ్ముడయ్యాయి. అంచనాలు భారీగా ఉండటంతో ఫస్ట్ డే ఈ మూవీ మంచి కలెక్షన్లనే రాబట్టింది.  దేశవ్యాప్తంగా రూ.48 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్​లోనోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. హిందీలో కలెక్షన్లపై క్లారిటీ లేదు. రూ.2.50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని చెబుతున్నారు. యూఎస్​ఏలో ప్రీమియర్​, తొలి రోజు కలెక్షన్లు కలిపి 1.4 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించాడు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

నోట్​: ఈ గణాంకాలు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చినవి మాత్రమే. అధికారిక సమాచారం కాదు…

Also Read: Viral: ఉత్త రంగురాళ్లేమో అనుకున్నారు.. ల్యాబ్‌కి పంపి టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్

Follow Us
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..