Raashi Khanna: చిన్నారి పై ముద్దుల వర్షం కురిపించిన హీరోయిన్.. నెట్టింట వీడియో వైరల్..
Raashi Khanna: పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందరికీ ఇష్టమే కదా.. ఇక మాంచి క్యూట్ గా స్వీట్‌గా ఏ చిన్న పిల్లాడైనా కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు ..

Raashi Khanna: పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందరికీ ఇష్టమే కదా.. ఇక మాంచి క్యూట్ గా స్వీట్‌గా ఏ చిన్న పిల్లాడైనా కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు .. వెంటనే దగ్గరికి లాక్కుని.. బుగ్గల మీద సాఫ్ట్‌గా ముద్దులు పెడతారు కదా.. ఆ.. ఇప్పుడు మన టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా అదే పని చేసింది. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అటు తమిళంలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగుతోంది రాశీఖన్నా.
ఎస్ రీసెంట్ గా తన దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లిన రాశీ ఖన్నా.. అక్కడ క్యూట్ క్యూట్ గా కనిపించిన బాబును దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది. అంతేకాదు #nephewlove హ్యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది కూడా.. ! అయితే ఇప్పుడా వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రాశి ఖన్నా గోపీచంద్ సరసన పక్కాకమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మలయాళంలోనూ ఓ సినిమా చేయబోతుంది ఈ బాబ్లీ బ్యూటీ. మరిన్ని ఇక్కడ చదవండి :
