Mahesh And Trivikram: అతడు… ఖలేజా.. మరి ఇప్పుడు.? 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేషన్..
Mahesh And Trivikram: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2005లో వచ్చిన అతడు చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా...
Mahesh And Trivikram: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2005లో వచ్చిన అతడు చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అద్భుత చిత్రాల్లో ఒకటిగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటికీ టీవీలో అతడు సినిమా వచ్చిందంటే.. హైయస్ట్ టీఆర్‌పీ దక్కించుకుంటుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా ఖలేజా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బుల్లి తెరపై మాత్రం సంచలనాలు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు నిజంగానే పండగా కదూ.. తాజాగా ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇలాంటి క్రేజీ కాంబినేషన్ వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్‌లో… అందరూ ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయ్యింది. 11 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుంది. 2022 వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది అంటూ రాసుకొచ్చారు. మరి మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మహేశ్, త్రివిక్రమ్ సినిమా ప్రకటిస్తూ చేసిన ట్వీట్..
The combo that everyone is waiting for is finally here! ?
After 11 long years, Super Star @urstrulymahesh garu & #Trivikram garu will team up again for #SSMB28 ⚡
Produced by S. Radha Krishna (Chinababu) garu under @haarikahassine banner.
In Theatres Summer 2022 ✨ pic.twitter.com/C9enTm5teO
— Haarika & Hassine Creations (@haarikahassine) May 1, 2021
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్