Raja The Great: ‘ఇట్స్ సీక్వెల్ టైమ్‌’… మ‌రోసారి అంధుడిగా అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ‌.?

Raja The Great: అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా తెర‌కెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2017లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. ర‌వితేజ...

Raja The Great: ‘ఇట్స్ సీక్వెల్ టైమ్‌’... మ‌రోసారి అంధుడిగా అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ‌.?
Raja The Great
Follow us

|

Updated on: May 01, 2021 | 6:02 PM

Raja The Great: అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా తెర‌కెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2017లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. ర‌వితేజ అంధుడి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఓవైపు ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటూ న‌వ్వులు పూయిస్తూనే మ‌రోవైపు రౌడీల‌ను చిత‌క‌బాదుతూ త‌న మాస్ విశ్వ‌రూపాన్ని చూపించారు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న స‌మ‌యంలో ర‌వితేజ ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సైతం ఈ సినిమాతో బ‌డా ద‌ర్శ‌కుల జాబితాలో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్క‌నుందనేది స‌ద‌రు వార్త సారాంశం. ఇదిలా ఉంటే గ‌తంలోనే అనిల్ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కిస్తాన‌ని తెలిపారు. అయితే తాజా స‌మాచారం మేర‌కు అనిల్ ఇప్ప‌టికే సీక్వెల్ కోసం క‌థ‌ను సిద్ధం చేశాడ‌ని తెలుస్తోంది. ర‌వితేజ కూడా ఈ క‌థ‌కు ఓకే చెప్పాడ‌ని.. పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని డైరెక్ట‌ర్‌కు చెప్పాడ‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రవితేజ ప్ర‌స్తుతం ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ ఎఫ్‌2 చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఎఫ్‌3 సినిమాను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత రాజా ది గ్రేట్ చిత్రం సీక్వెల్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read: Ritu varma: కొండ‌ల్లో, కోన‌ల్లో సుంద‌రాంగి.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న రీతూ వ‌ర్మ‌

Indian Covid-19 Variant: భారత్‌లో కొత్త వేరియంట్లతో కరోనా విజృంభణ.. ఈ వేరియంట్ ఎక్కడెక్కడ వ్యాపించిందంటే?

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు