Raviteja: రావణాసుర నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ప్యార్‏లోన పాగల్ అంటోన్న మాస్ మాహారాజా..

అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.

Raviteja: రావణాసుర నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ప్యార్‏లోన పాగల్ అంటోన్న మాస్ మాహారాజా..
Raviteja
Follow us

|

Updated on: Feb 16, 2023 | 9:52 PM

వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఈ ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు మాస్ మాహారాజ. ఇక అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.

హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు