Allu Arjun-Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. అసలు ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ఫ 2 సినిమా రిలీజ్ కు ఇంకా దాదాపు 3 వారాలు ఉంది. కానీ అప్పుడే దేశమంతా పుష్ఫ మేనియాతో ఊగిపోతోంది. దీనికి కారణం ఆదివారం (నవంబర్ 17) రిలీజైన పుష్ఫ 2 ట్రైలర్ వైల్డ్ ఫైర్ లా ఉండడమే..

Allu Arjun-Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. అసలు ఏం జరిగిందంటే?
Kiran Abbavaram, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2024 | 4:17 PM

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ఆదివారం (నవంబర్ 17) పుష్ఫ 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బిహార్ రాజధాని పాట్నా వేదికగా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏకంగా 2 లక్షల మంది జనాలు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇక పుష్ఫ 2 ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీన్ సీన్ కు ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు, డైలాగులు, బన్నీ పర్ఫామెన్స్.. ఇలా నిజంగానే వైల్డ్ ఫైర్ ను తలపించిందని చెప్పవచ్చు. అందుకే రిలీజ్ చేసిన అతి కొద్ది సమయంలోనే యూట్యూబ్ రికార్డులు తిరగరాసేస్తోంది. సినీ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుష్ఫ 2 ట్రైలర్ చాలా బాగుందని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్’ అని ట్వీట్ చేశాడు.

కిరణ్ అబ్బవరం ట్వీట్ కు వెంటనే స్పందించాడు అల్లు అర్జున్. ‘థాంక్యూ మై బ్రదర్.. అలాగే కంగ్రాట్స్.. నేను బిజీగా ఉండి మీ సినిమా ‘క’ చూడలేకపోయాను. తర్వాత కచ్చితంగా మూవీ చూసి నీకు కాల్ చేస్తాను’ ‘అని రిప్లై ఇచ్చాడు. దీనికి స్పందించిన కిరణ్ అబ్బవరం ‘థ్యాంక్యూ అన్నా, డిసెంబర్ 05 కోసం వెయిటింగ్ ‘ అని మెసేజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్, రీట్వీట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ సింప్లిసిటీనీ అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం ట్వీట్, బన్నీ రిప్లై..

అంతకు ముందు హను రాఘవపూడి, రాజమౌళి, బాబీ, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, గోపీచంద్ మలినేని తదితర సినీ ప్రమఖులు పుష్ప 2 ట్రైలర్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రాజమౌళి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్