Rashmika Mandanna: నేను అలా చేతులు చూపించడం నచ్చలేదేమో.. ట్రోలింగ్స్ పై రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్..

కొద్ది రోజులుగా దక్షిణాది ప్రేక్షకుల నుంచి నెగిటివిటిని ఎదుర్కొంటుంది రష్మిక. గతంలో కాంతార సినిమా చూడలేదు అని చెప్పడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత తనను కథానాయికగా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగ చేస్తూ చూపించడంతో మరోసారి కన్నడిగులు ఆగ్రహానికి గురైంది.

Rashmika Mandanna: నేను అలా చేతులు చూపించడం నచ్చలేదేమో.. ట్రోలింగ్స్ పై రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్..
Rashmika Mandanna
Follow us

|

Updated on: Jan 07, 2023 | 7:24 AM

గతేడాది బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాదు.. వివాదాలతోనూ సాహవాసం చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో నార్త్ ఆడియన్స్ నుంచి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులుగా దక్షిణాది ప్రేక్షకుల నుంచి నెగిటివిటిని ఎదుర్కొంటుంది. గతంలో కాంతార సినిమా చూడలేదు అని చెప్పడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత తనను కథానాయికగా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగ చేస్తూ చూపించడంతో మరోసారి కన్నడిగులు ఆగ్రహానికి గురైంది. టాప్ హీరోయిన్ అయ్యాక.. యాటిట్యూడ్ చూపిస్తుందని.. సొంత పరిశ్రమను మరిచిపోయిందని.. తనను కన్నడలో బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.

ఇక ఇటీవల మిషన్ మజ్ను ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో కేవలం మాసాల సాంగ్స్ మాత్రమే ఉంటాయని.. అసలైన రొమాంటిక్ సాంగ్స్ అంటే ఉత్తరాది సినిమాల్లో ఉంటాయని చెబుతూ..మరోసారి వివాదానికి తెర తీసింది. దీంతో రష్మిక మాట్లాడిన తీరుపై నెటిజన్స్ సీరియస్ అయ్యారు. దీంతో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ ట్రోలింగ్స్ పై స్పందించింది రష్మిక. తను ఓ నటి అని.. అందరికీ నచ్చకపోవచ్చు అని పేర్కొంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. అన్ని సమయాల్లో ప్రజలు తనను ఇష్టపడతారని తాను ఆశించడం లేదని చెప్పుకొచ్చింది.

“మనం నటీనటులమైందున ప్రజలు మనల్ని ఇష్టపడతారని మేము ఆశించలేము. ఇక్కడ చాలా ద్వేషం ఉంటుంది.. ప్రేమ కూడా ఉంటుంది. నేను పబ్లిక్ సెలబ్రెటీని. ప్రజలతో మాట్లాడుతున్నాం.. వారితో ఉంటున్నాం. కొన్ని సార్లు వారంత మనల్ని ఇష్టపడకపోవచ్చు. నేను మాట్లాడే విధానం.. చేతులతో అలా సంజ్ఞలు చేయడం కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాగే నేను ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చకపోవచ్చు. ఈ కారణాలు వారికి నా అభిమానాన్ని తగ్గిస్తాయి. కానీ మరికొందరికి నేనంటే ప్రేమ ఉంది. వారికి నేను కృతజ్ఞురాలిని. ” అంటూ చెప్పుకొచ్చారు రష్మిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.