Allu Sneha: ఆచరణలోకి న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌.. కుమారుడికి వంట నేర్పించే పనిలో అల్లు స్నేహ.. ఫొటోస్‌ వైరల్‌

కొత్త సంవత్సరానికి సంబంధించి ఎలాంటి తీర్మాణాలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. అందులో ఒక ప్రశ్నకు తన తనయుడు అయాన్‌తో కలిసి వంట చేయాలనుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. అప్పుడామె ఏదో సరదాగా అందేమో అనుకున్నారు చాలామంది. కానీ నిజంగానే తన ఆలోచనను ఆచరణలో పెట్టేసింది స్నేహ.

Allu Sneha: ఆచరణలోకి న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌.. కుమారుడికి వంట నేర్పించే పనిలో అల్లు స్నేహ.. ఫొటోస్‌ వైరల్‌
Allu Arjun Family
Follow us

|

Updated on: Jan 07, 2023 | 8:06 AM

టాలీవుడ్‌లో ది మోస్ట్ స్టైలిష్‌ అండ్‌ రొమాంటిక్‌ కపుల్‌ అంటే అల్లు అర్జున్‌- స్నేహ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఐకాన్‌ స్టార్‌గా అటు సినిమాల్లోనూ, ఇటు రీల్‌లైఫ్‌లోనూ బన్నీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన సతీమణి స్నేహ కూడా హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్ ఫొటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార ఇటీవల ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించింది.  కొత్త సంవత్సరానికి సంబంధించి ఎలాంటి తీర్మాణాలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. అందులో ఒక ప్రశ్నకు తన తనయుడు అయాన్‌తో కలిసి వంట చేయాలనుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. అప్పుడామె ఏదో సరదాగా అందేమో అనుకున్నారు చాలామంది. కానీ నిజంగానే తన ఆలోచనను ఆచరణలో పెట్టేసింది బన్నీ సతీమణి . తాజాగా అయాన్‌తో కలిసి వంట చేస్తున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ఇందులో అయాన్‌ తల్లికి సాయంగా కిచెన్‌లో కూరగాయలు కట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయాన్‌ తల్లికి ఇలాగే హెల్ప్‌ చేస్తే త్వరలోనే మంచి చెఫ్‌ అవుతాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్‌.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన కూతురు అర్హ.. ఇప్పటికే సమంత లీడ్ రోల్‌లో చేసిన శాకుంతలంలో నటించింది. త్వరలో ప్రారంభమయ్యే మహేశ్ బాబు సినిమాలోనూ నటించనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా నటిగా పరిచయం కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియదు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య సోషల్ మీడియా సర్వే లో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సెలబ్రిటీగా స్నేహ రెడ్డి నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..