AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య శాటిలైట్’ రైట్స్ సొంతం చేసుకున్న ఆ టీవీ ఛానల్.. బుల్లితెరపై చిరు సందడి..

చాలా కాలం తర్వాత చిరు ఇందులో పూర్తి స్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఓవైపు పోస్టర్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ రాగా.. మరోవైపు బాస్ పార్టీ.. పూనకాలు లోడింగ్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్య శాటిలైట్' రైట్స్ సొంతం చేసుకున్న ఆ టీవీ ఛానల్.. బుల్లితెరపై చిరు సందడి..
Waltair Veerayya
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2023 | 7:05 AM

Share

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఇందులో మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది. చాలా కాలం తర్వాత చిరు ఇందులో పూర్తి స్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఓవైపు పోస్టర్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ రాగా.. మరోవైపు బాస్ పార్టీ.. పూనకాలు లోడింగ్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించగా.. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా థియేట్రికల్ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అనంతరం జెమిని టీవీలో ప్రసారం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక జనవరి 7న వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ నయా పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.