Puri Jagannadh: పూరి నుంచి బాలయ్య సినిమా అప్డేట్ రానుందా.. డైనమిక్ డైరెక్టర్ బర్త్ డే కోసం ఫాన్స్ వెయిటింగ్..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది.

Puri Jagannadh: పూరి నుంచి బాలయ్య సినిమా అప్డేట్ రానుందా.. డైనమిక్ డైరెక్టర్ బర్త్ డే కోసం ఫాన్స్ వెయిటింగ్..
Purijagannadh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 5:01 PM

Puri Jagannadh: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్‌‌‌కు.. అనన్య టాలీవుడ్‌కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. పూరి, ఛార్మీ, కరణ్ జోహర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ఇది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను కరోనా తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభించాడు పూరి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌‌‌ను శరవేగంగా చేయాలని ప్లాన్ వేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును ‘గోవా’లో ప్లాన్ చేశారు.సెప్టెంబర్ 30తో గోవా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రోజున చిత్ర టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. వాస్తవానికి టీజర్ ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మే9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా టీజర్‌ను విడుదల చేయలేకపోయారు. అప్పటి నుంచి పూరి-విజయ్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌కు తల్లిగా ఆమె నటిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమా టీజర్ తోపాటు నట సింహం బాలకృష్ణతో సినిమా చేయాలనీ చూస్తున్నాడు పూరి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పైసావసుల్ అనే సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ… ఈ సినిమా పూరి బాలయ్యను చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పూరి నుంచి బాలయ్య సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు.. నేను బాగా ఇష్టపడే వ్యక్తి పవన్.. వైరల్ అవుతున్న మహేష్ ఓల్డ్ ట్వీట్

R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!