Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు.. నేను బాగా ఇష్టపడే వ్యక్తి పవన్.. వైరల్ అవుతున్న మహేష్ ఓల్డ్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా నటిస్తూ మరో వైపు రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న విషయం తెలిసిందే..

Mahesh Babu: పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు.. నేను బాగా ఇష్టపడే వ్యక్తి పవన్.. వైరల్ అవుతున్న మహేష్ ఓల్డ్ ట్వీట్
Pawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 4:23 PM

PawanKalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా నటిస్తూ మరో వైపు రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న విషయం తెలిసిందే.. ఇక నిన్న (25న )జరిగిన సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. తన మీద ఉన్న కోపంతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీరంగంలో సమస్యలను పరిష్కరించేందుకు సినీపెద్దలతో భేటీలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సొంత వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు అమ్మేందుకు నిర్ణయించింది. అలాగే త్వరలో సినిమా పెద్దలు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో జగన్‌తో భేటీ కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ స్పీచ్ పైన మహేష్ బాబు చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ ఓ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్ గురించి మహేష్ ప్రసంశించారు.. 2010లో మహేష్ ఆ ట్వీట్ చేశారు. అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం అన్నమాట.. ఇప్పుడు ఈ ట్వీట్‌ను రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన స్పీచ్‌కు మ్యాచ్ చేస్తూ ఆ ట్వీట్స్‌ను వైరల్ చేస్తున్నారు ఫాన్స్..  ఆ ట్వీట్‌లో మహేష్ ఏమన్నారంటే.. ”ఎవరో చెప్తే విన్నాను. నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు అని.. అది విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి’ అని ఉంది. ప్రస్తుతం పవన్ పై మహేష్ చేసిన ట్వీట్ తెగ హల్‌చల్ చేస్తోంది.

Mahesh Babu

Mahesh Babu

మరిన్ని ఇక్కడ చదవండి : 

R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

Mahesh Babu : వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా..? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..